47. త్రిపుటి

47.  త్రిపుటి


            ఇట్లు విభాగించి చెప్పి, పిదప జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయంబులనునివి త్రిపుటి యనదగు.  వాటియందు మూలాహంకారంబునందు ప్రతిఫలించిన జీవ చైతన్యంబె జ్ఞాతృవనబడు. మనంబునందు ప్రతిఫలించిన జీవ చైతన్యంబె జ్ఞానమనంబడు.  భూత భౌతిక విషయంబులె  జ్ఞేయమనబడు.  మరి యిచట మనస్సె యిరువది నాల్గు తత్త్వంబులు. మూలాహంకారంబె యిరువదైదోదగు. అహంకార గత చిదాభాసజీవుండె షడ్వింశకుండగును. మాయోపాధికుండైన యీశ్వరుండె సప్తవింశకుండనబడు.  ఆ యహంకార జీవులకు అధిష్ఠానమైన కూటస్థుండె అష్టవింశకుండనబడు. ఆ మాయా యీశ్వరుల కధిష్ఠానమైన బ్రహ్మంబె యిరువైతొమ్మిదో దగును.