46. భూతంబులు

46.  భూతంబులు


            పూర్వోక్త భూతంబులకు క్రమంబుగా ధారణ, పిండీకరణ, పాక, వ్యూహ, అవకాశంబులను నివి వ్యాపారంబులు.  బ్రహ్మ విష్ణు రుద్ర యీశ్వర సదాశివులను వారలధి దేవతులు.  గంధాదులె గుణంబులు. మరియు నా భూత గుణంబులయందు ఆకాశంబులకు నొక్క గుణంబు, వాయువునకు రెండు, అగ్నికి మూడు, వుదకంబునకునాల్గు, భూమి కైదు గుణంబులు.  వాటిభేదంబులెట్లనిన ఆకాశంబునకు ప్రతిధ్వని గుణంబొక్కటి. వాయువునకు విస్సను శబ్దంబును, వుష్ణ శీత స్పర్శన మనెడి గుణంబులు రెండు. అగ్నికి భుగభుగన శబ్దంబు, పుష్ణ స్పర్శ, ప్రభా రూపంబులను గుణంబులు మూడు. జలంబునకు బుళబుళను శబ్దంబు, శీత స్పర్శ, శ్వేత రూప, మధుర రసంబులను గుణంబులునాల్గు.  భూమికి గడగడను శబ్దంబు, కఠిన స్పర్శ, నీలాది విచిత్రరూపు, మధురామ్లాది నానా రసంబులు, సుగంధ దుర్గంధములనెడి గుణంబులు ఐదు.