40. మాయానామపంచకం

40.  మాయానామపంచకం


     తమస్సు, మాయ, మోహం, అవిద్య, అనృతాత్మిక యనునివె మాయాపంచకంబు.  వాటియందు జీవచైతన్యం బాఛ్ఛాదించుట చేత తమస్సుఅనబడు. జగద్రూపంబై అన్యధా తోచుటకు కారణంబగుటచే మాయయనబడు.  ఆ తోచిన జగత్తునందు శుక్తి రజితాది విపరీత జ్ఞానంబు బుట్టించుటచేత మోహమనిపించుకొనును. విద్య నష్టంబగు గావున అవిద్యయనంబడు.  సద్రూపంబునకంటె అన్యంబౌట అనృతాత్మిక యనదగు.  మరియు సంకోచ వికాసంబులనునివె మాయాధర్మద్వయంబు. వాటియందు యట్లు చిత్రపటంబు తన ప్రసరణంబుచేత చిత్రంబుల గనుపింపంజేశి సంకోచంబుచేత చిత్రంబుల తిరోధానంబు చేయునట్లు మాయ తన వికాస ధర్మంబుచే ప్రపంచ విస్తారంబు జూపి సంకోచ ధర్మంబుచే నది యడంగించుచు నుండును.