3ఎ. ఉపపురాణములు

3ఎ. ఉపపురాణములు

            ఉపపురాణంబులెవ్వియనిన సనత్కుమారపురాణ, నారసింహపురాణ, నందిపురాణ, శివధర్మపురాణ, దుర్వాసపురాణ, నారదియ్యపురాణ, కపిలపురాణ, మాణవపురాణ, ఉశనపురాణ, బ్రహ్మాండపురాణ, వారుణపురాణ, కాళిపురాణ, వాశిష్టపురాణ, లైంగ్యపురాణ, సాంబపురాణ, సౌరపురాణ, పరాశరపురాణ, మారీచపురాణ, భార్గవపురాణంబులనేటివి ఆయా నామధేయంబుగల వారిచేత నిరూపితంబులయిన వుపపురాణంబులు.  వీటియందు వైదిక ధర్మాదులన్నియు ప్రతిపాద్యంబులగు.  మరియు భారత రామాయణంబులను రెండే వ్యాస వాల్మీకులచే నిరూపించబడిన ఇతిహాసంబులందు సత్వాదిగుణ విభేదంబులను త్రిదేవతా లక్షణంబులును దేవదానవాది జనన క్రమంబును యుధిష్టిర రామచంద్రాది రాజవృత్తాంతంబు సువైదిక ధర్మంబులును ప్రతిపాద్యంబులై యొప్పు.