3. పురాణములు

3. పురాణములు


            బ్రహ్మపురాణ, పద్మపురాణ, వైష్ణవపురాణ, శైవపురాణ, భాగవతపురాణ, నారదియ్యపురాణ, మార్కండేయపురాణ, ఆగ్నేయపురాణ, భవిష్యత్పురాణ, బ్రహ్మవైవర్తపురాణ, లైంగ్యపురాణ, వారాహపురాణ, స్కందపురాణ, వామనపురాణ, కూర్మపురాణ, మత్స్యపురాణ, గారుడపురాణ, బ్రహ్మాండపురాణంబులన నివేశివానుగ్రహంబుచే వ్యాసఋషీశ్వరోక్తంబులన వేదంబులనష్ఠశాఖార్ధ ప్రతిపాదకంబులైన నాల్గు లక్షల గ్రంథ సంఖ్య గల అష్టాదశ మూల పురాణంబులు, వాటియందు శైవ, స్కంధ, లైంగ్య, కూర్మ, వామన, వరాహ, భవిష్యత్తు, మత్స్య, మార్కండేయ, బ్రహ్మాండంబులనెడి దశ పురాణంబులె, శివపురాణంబు లనందగు.  నారదియ్య, భాగవత, గారుడ, విష్ణుపురాణంబులు నాల్గు, నారాయణ ప్రతిపాదికంబులు.  బ్రహ్మ పద్మ  పురాణంబులనెడి  రెండు చతర్ముఖ  ప్రతిపాదికంబులు, బ్రహ్మవైవర్తకంబను నొక్క బురాణంబె సూర్య ప్రతిపాదికంబును, ఆగ్నేయపురాణంబనునొక్కటి అగ్ని ప్రతిపాదకంబు. ఇందు దేవతా తారతమ్యంబులు గ్రహింపంబడు.  మరియు నాపురాణంబులందు సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశాను చరితంబులను పంచలక్షణంబులును, సమస్త, వైదిక తాంత్రిక ధర్మంబులును విదితంబగు.