24. ఆనందాష్టకం

24. ఆనందాష్టకం


            విషయానంద, బ్రహ్మానంద, వాసనానంద, ముఖ్యానంద, నిజానంద, ఆత్మానంద, అద్వైతానంద, విద్యానందంబు లనెడివే ఆనందాష్టభేదంబులు. వీటియందు  వనితాది విషయలాభం బైనంతట తోచినదే విషయానందమగు.  నిద్రసమయమందె తోచినదే బ్రహ్మానందంబగు.  హానో పాదనంబులేని ఉపేక్షా బుద్ధియందు తోచినదె ముఖ్యానందంబు.  యోగాభ్యాస బలంబున మనోలయంబైనప్పుడు తోచినదె నిజానందమనదగు. ప్రియ వనితాది విషయంబులందు తానె ప్రియతముండని యెరిగినప్పుడుతోచినదె ఆత్మానందంబగు.  నామరూప ప్రపంచంబంతయు మిథ్య, తానె సత్యంబను వివేకంబునందు దోచినదె అద్వైతానందంబనదగు.  తత్వమస్యాది మహావాక్య జనితాపరోక్ష జ్ఞానంబునందు దోచినదె విద్యానందంబనదగు.