22. సత్తత్రయం

22. సత్తత్రయం


            క్రమంబుగా పంచరూపంబులకు ఉపాధిచే భేదం బెట్లనిన వ్యావహారికసత్త ప్రాతిభాసికసత్త పారమార్ధికసత్తలనునవి సత్తాత్రయంబు, దీని యందు జాగ్రత్తున ఘటాదుల సత్తే విదేహకైవల్య పర్యంతంబు సుప్తి మూర్ఛాద్యవస్తల దోచక యుండి పిదపలేచి చూచినను మొదలయట్ల దోచుచుండగావున  వ్యావహారిక సత్తయనదగు. శుక్తికా రజిత స్వప్న విషయాదుల సత్తె ఆతోచు కాలంబుననెగాని హెచ్చరిక గలిగి మరియు దోచు స్వప్నంబున లేదుగావున ప్రాతిభాసిక సత్తయనదగు.  సమస్త కల్పనలకధిష్టానంబై తోచక లయంబు నొందక నిలచిన బ్రహ్మసత్తె పారమార్థిక సత్తయనబడును.