20. ఉపాయత్రయం

20. ఉపాయత్రయం


            అతద్వ్యావృత్తి లక్షణ, తటిస్త లక్షణ, స్వరూప లక్షణంబులనెడిదే దృగ్రూప వస్తు సాక్షాత్కారంబున కుపాయత్రయంబు దానియందు దేహద్యనాత్మ వగంబుల యుక్తిచేత నేతి ముఖంబున నిషేధించి ఆత్ముని దెలుపుటె అతద్వ్యావృత్తి లక్షణంబగు.  శాఖాగ్రంబున చంద్రని దెలుపునట్లు భూతాది జగత్కారణ త్వంబుచేత ఆత్ముని దెలుపుటె తటిస్త లక్షణం బనదగు.  ప్రకృష్ట ప్రకాశరూపుండె సూర్యుండన్నట్లు యాత్ము నిజస్తితి దెలుపుటె స్వరూపలక్షణం బగును.