18. దృగ్‌దృశ్య లక్షణం

18. దృగ్‌దృశ్య లక్షణం


            దృక్కుదృశ్యంబన రెండే పదార్థంబులు, స్వగత సజాతియ్య విజాతియ్యంబు లివి దృక్కునందు నిరాకరించదగిన భేదంబులు.  వీటి దృష్టాంతరంబులు యెట్లన్నను, లోకంబున నొకానొక వృక్షంబునకు పత్ర పుష్ప ఫలాదులే స్వగత భేదంబగు, వృక్షాంతరంబు సజాతియ్య భేదంబనందగు.  పాషాణాదులే విజాతియ్య భేదంబులగు.  మరియును సద్రూపబ్రహ్మంబు గగనంబెట్లట్లు నిరవయవంబౌట చాతను సత్తుకు సదంతరంబె లేదు గావునను బ్రహ్మంబునందు స్వగత భేదంబు సజాతియ్య భేదంబులు లేకయుండినను జగత్కారణంబైన మాయగలదు గావున విజాతియ్య భేదంబు యెట్లు లేదనిన, లోకంబున చిత్రకుని కంటె చిత్రశక్తికి ప్రత్యేక భావంబులేని దెట్లట్లు సన్మాత్ర బ్రహ్మంబునకంటె మాయకు విలక్షణత్వంబే లేదు గావున బ్రహ్మంబునందు విజాతియ్య భేదంబులేదనుటె సిద్ధంబు.  ఈ యర్థంబున ఏకమేవాద్వితీయం బ్రహ్మయను శృతివాక్యంబునంగల ఏకం, ఏవ, అద్వితీయంబులను పదత్రయంబునకు ఐక్య అవధారణ ద్వైత నిషేంధంబులనెడి అర్థత్రయంబు గలదు గావున ఆ క్రమంబుననె బ్రహ్మంబునందు స్వగత, సజాతియ్య విజాతీయ్యంబనెడి భేదత్రయంబు లేదనుటె సత్యంబగును.