16. బోధత్రయం

16. బోధత్రయం


            ఆ యుపదేశ క్రమంబందలి ఉద్దేశ, లక్షణ, పరీక్ష అనునివి బోధ ప్రకారంబులు.  వాటి యందవి తా సమర్థింపనిష్టమగు వస్తువును నామమాత్రంబె కీర్తింపుటె ఉద్దేశమనదగు, గంగడోలు గలిగినదె గోపనినయట్లు ఆవస్తువు యొక్క అసాధారణ ధర్మంబు జెప్పుటె లక్షణమనదగు.  లక్షితమగు వస్తువుకా లక్షణంబు గలుగుటయు లేకుండుట యు విచారంబు జేయుటె పరీక్షయనదగు.