12. చతుర్విధ గురుసేవ

12. చతుర్విధ గురుసేవ


            సాధన సంపన్నుండైన శిష్యునిచేత జేయందగిన గురు శుశూౄష అంగ, ఆప్త, స్థాన, సద్భావంబులని చతుర్విధంబులై యుండు.  అవియెట్లనిన గురువుల కనుకూల వృత్తియె ఆప్తంబనదగు.  గురుపాద ప్రక్షాళనాదులె అంగమనదగు.  గురువులగృహక్షేత్ర రక్షణాదులె స్థానమనందగు.  గురువే సాక్షాత్పరశివుండను విశ్వాసంబె సద్భావంబననప్పు.