11. సాధన చతుష్టయం

11. సాధన చతుష్టయం

            నిత్యానిత్య వస్తు వివేక, ఇహాముత్రార్థఫలభోగవిరాగ, షట్కశమాది ముముక్షత్వములను నివేసాధన చతుష్టంబు. వీటి యందు చిద్రూపంబె నిత్యంబు. తక్కిన సమస్తంబు మిథ్యని తెలియుటె నిత్యానిత్య వస్తు వివేకంబు. ఇహపరంబులందును వనితాది భోగ విషయంబు లన్నియు కర్మ జన్యంబులు. గావున అనిత్యంబులయ్యు సంపాదనంబున కాదియందున, భోగంబును అంతంబునందు క్రమంబుగా మహాప్రయాస వైర హస్యంబులు గల్గుట చేతను దుఃఖ రూపంబని మనంబునం గరకనుండుటె ఇహాముత్రార్థ ఫలభోగ విరాగంబనదగు.  దమంబు మొదలగు షడ్గుణ సిద్ధియె శమమనదగు.  సహజ సాయుజ్య మోక్షాపేక్షయె ముముక్షుత్వంబనదగు.   మరి యంతఃకరణ నిగ్రహంబె శమమనందగు.  బాహ్యకరణ నిగ్రహంబె దమమనబడు, క్రోధాదుల సహించుటె తితీక్షయననొప్పు, సకల కర్మపరిత్యాగంబె ఉపరతియనందగు, శృతి గురువులయందు కేవల విశ్వాసంబు శ్రద్ధయననొప్పు.  గురూపదేశంబు చిత్తంబున దృఢంబైనదె సమాధియనదగు.